Prema Garadi Song Lyrics – Committee Kurrollu

Prema Garadi Song Lyrics – Committee Kurrollu

Prema Garadi Song Lyrics – Committee Kurrollu

  • Song Name – Prema Garadi
  • Lyricist – Kittu Vissapragada
  • Singers – Armaan Malik
  • Music Composer – Anudeep Dev

సూడు సూడు సిన్నదాని నవ్వే సూడంటా
కోల కళ్ళ సింగారాలు అమ్మాయివంటా
తిప్పుకుంట ఈదుల్లోన సాగే పిల్లంటా
పాలపిట్ట ఎంటే పడ్డ కోతి మూకంటా…

అరెరె కుర్ర ఈడే మళ్ళీ మళ్ళీ రానే రాదే
ఇప్పుడే సెయ్యాలంటా సిన్ని అల్లర్లే
ఎవరో సూత్తావున్న కంగారంటు లేనే లేదే
మనసే హడావిడి చేసే నేడే
ఇది వయసుకి కితకితలేగా…

ఇదేమి గారడీ… ఇది ప్రేమ గారడీ
ఈ సిన్ని గుండెల్లో తూఫాను మాదిరి.

రేలా రేలా, రేలా రేలా, రేలా రేలా రేలారే
రేలా రేలా, రేలా రేలా, రేలా రేలా రేలారే

రలా రేలా, రేలా రేలా, రేలా రేలా రేలారే
రేలా రేలా, రేలా రేలా, రేలా రేలా రేలారే

వయ్యారమో, బంగారమో
అమ్మాయి ఆ నవ్వుల్లోన
దాచి పెట్టుకుందే

ఈలే ఏసి, గోలే చేసి
కళ్ళే తిప్పి చూడంగానే
గుండె జారిపోయే అందరికీ

కులికే తెగ కులికే
మగువల వెనకాలే
పడుతూ లేస్తూ
పరుగే పెడుతున్నానే

పలికే పెదవులపై చిరునవ్వే పూస్తే
ఎదలో గొడవే మొదలైపోయే
ఇది తెలియని పరవశమేగా

ఇదేమి గారడీ… ఇది ప్రేమ గారడీ
ఈ సిన్ని గుండెల్లో… తూఫాను మాదిరి
తూఫాను మాదిరీ…

కోరి కోరీ చెంతే చెరీ
సిగ్గే పడి మళ్ళీ కొంచెం
దూరం జరుగుతుంటే,

జంటే కట్టి, దారే పట్టి
చెట్టాపట్టాలెయ్యాలంటూ
గుండె కోరుతున్న తొందరికీ

తెలిసీ తెలియకనే మొదలయ్యే స్నేహం
చినుకై తగిలి చిగురైపోయే మాయే
మొదటి ప్రేమంటే పులకించే ప్రాణం
సరదా పడితే పెరిగే హాయే.
ఇది వయసుకి కితకితలేగా…

ఇదేమి గారడీ… ఇది ప్రేమ గారడీ
ఈ సిన్ని గుండెల్లో… తూఫాను మాదిరి
తూఫాను మాదిరీ…

Prema Garadi Song Lyrics – Committee Kurrollu

Prema Garadi Song Lyrics – Committee Kurrollu

2 thoughts on “Prema Garadi Song Lyrics – Committee Kurrollu”

Leave a Comment